ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌లో కొవిడ్ విలయం.. 24 గంటల్లో 2వేలకు పైగా మరణాలు

ABN, First Publish Date - 2020-11-25T20:13:15+05:30

అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 2వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒకేరోజు కొవిడ్ వల్ల 2,146 మంది మృతి చెందినట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. మే నెలలో చివరిసారిగా రెండు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. ఆరు నెలల తర్వాత మంగళవారం మరోసారి 2వేలకు పైగా కరోనా మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న సంభవించిన మరణాలతో కలిపి ఇప్పటివరకు యూఎస్ వ్యాప్తంగా ఈ వైరస్‌కు బలైనవారి సంఖ్య 2,59,925కు చేరింది. 


కాగా, దేశంలో మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ఒకేరోజు 2వేలకు పైగా కొవిడ్ మరణాలు నమోదు కావడం ఇది 21వ సారి. అలాగే మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,72,935 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మహమ్మారి సోకిన వారి సంఖ్య 1,25,91,163కు చేరింది. ఇక ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.     

Updated Date - 2020-11-25T20:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising