ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ అవుతున్న గవర్నర్ వీడియో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2020-09-24T22:46:48+05:30

అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్ర గవర్నర్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో స్పంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వాషింగ్టన్: అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్ర గవర్నర్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో స్పందిస్తున్న జంతు ప్రేమికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలోని దృశ్యాల ప్రకారం సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్.. నెత్తిన టోపీ పెట్టుకుని, చేతులో తుపాకీ పట్టుకుని మొక్క జొన్న చేనులో సంచరించారు. పక్షులు చేనులో వాలకుండా.. కనిపించినదాన్ని కనిపించినట్లు తుపాకీతో కాల్చి చంపారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేస్తూ.. ‘సౌత్ డకోటా రాష్ట్రంలో మేము ఈ విధంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నాము’ అంటూ రాసుకొచ్చారు. కాగా.. ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియోపట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే పక్షులను కాల్చి చంపడంపట్ల కొందరు జంతు ప్రేమికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకేమైనా పిచ్చిపట్టిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో‌ను ఇప్పటి వరకు 20లక్షల మంది వీక్షించారు. 


Updated Date - 2020-09-24T22:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising