ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మొదట ఓటేసేది వాళ్లే.. ఫలితాలు వచ్చేది కూడా అక్కడి నుంచే..!

ABN, First Publish Date - 2020-11-03T19:15:50+05:30

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ముందుగా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్సివిల్లే నాచ్ నగరంలో పోలింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ప్రతీసారి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ఓటింగ్ మొదటగా జరుగుతుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ముందుగా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్సివిల్లే నాచ్ నగరంలో పోలింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ప్రతీసారి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ఓటింగ్ మొదటగా జరుగుతుంది.. అలాగే ఇక్కడి నుంచే ఫలితాల ప్రక్రియ వెలువడటం ప్రారంభమవుతుంది.. డిక్సివిల్లే నాచ్ బల్సామ్స్ రిసార్ట్‌లో బ్యాలెట్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నగరంలో కేవలం ఐదుగురు మాత్రమే ఓటర్లు ఉండటం గమనార్హం. 2016 ఎన్నికల సమయంలో ఈ నగరంలో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. వారిలో నలుగురు హిల్లరీ క్లింటన్‌కు, ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేశారు.. 


కరోనా మహమ్మారి విజృంభణ, అమెరికాలో నిరుద్యోగం, ఆమెరికా ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సమస్యలు.. వంటి అంశాల నడుమ అమెరికన్ పౌరులు తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు మరోసారి ట్రంప్‌కే సారథ్య బాధ్యతలు ఇస్తారా..? లేక వైట్‌హౌస్ పగ్గాలను జో బైడెన్‌కు అందిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో సగానికి సగం దక్కించుకున్నవారినే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటనే గెలుస్తారంటూ పెద్ద ఎ్తతున సర్వేలు ప్రకటించాయి. సర్వేలు ప్రకటించినట్టుగానే ఆమెకు ప్రజాదరణ ట్రంప్ కంటే ఎక్కువే ఉన్నట్టు ఓట్ల శాతంలో కనిపించినా.. ఎలక్ట్రోరల్ ఓట్ల విషయంలో మాత్రం వెనుకబడ్డారు. అనూహ్య రీతిలో ట్రంప్ అత్యధిక ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించి అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఈసారి జో బైడెన్ గెలుస్తారంటూ సర్వేలు చెబుతున్నాయి.. మరి మరోసారి మ్యాజిక్ చేసి ట్రంప్ అధికారంలోకి వస్తారా..? లేక పరాజయం పాలవుతారా..? అన్నది వేచిచూడాలి.. 

Updated Date - 2020-11-03T19:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising