ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!

ABN, First Publish Date - 2020-09-26T20:52:40+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ.. మెయిల్ ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ.. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంపై ఆయన విమర్శలను కొనసాగించారు. ఎన్నికల్లో గెలిచింది ఎవరో తెలుసుకోవడానికి నెలల సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రోజు వర్జీనియా రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల్లో గెలిచింది ఎవరో తెలుసుకోవడానికి నెలలు పట్టొచ్చు. ఆ రోజు రాత్రే.. విజేత ఎవరో తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. నేను ఆధిక్యంలో ఉన్నప్పుడు.. బ్యాలెట్లు వచ్చి పడుతూ ఉంటాయి. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం వల్ల.. బ్యాలెట్లు ఆలస్యంగా రావొచ్చని వారు చెప్తున్నారు. ఇదో గందరగోళం. దీంతో ఫలితం ఆలస్యం అవుతుంది విజేత ఎవరో తెలియడానికి నెలలు సమయం పట్టొచ్చు’ అని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో అమెరికాలో దాదాపు సగం మంది ఓటర్లు.. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ‘ఒకవేళ ఎన్నికల్లో నేను ఓడితే.. అధికారాన్ని అంత సులువుగా బదిలీ చేయనంటూ’ ఇటీవల ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే.. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-09-26T20:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising