ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే !

ABN, First Publish Date - 2020-12-04T00:17:58+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో యూఎస్‌లో ఈ వైరస్‌కు 2,700 మందికిపైగా బలైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఏప్రిల్ తర్వాత ఒకేరోజు ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 2,731 మంది కరోనా వల్ల మృతిచెందారని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌కు బలైన వారి సంఖ్య 2,73,181కు చేరింది. ఇక మహమ్మారి ఇప్పటివరకు 1.41 కోట్లకు పైగా మందికి సోకింది. 


అమెరికా వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నందున ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే.. వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అమెరికన్లకు డిసెంబర్ రెండో వారం నాటికి కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.   


Updated Date - 2020-12-04T00:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising