ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 వేలు దాటిన మృతుల సంఖ్య.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-04-05T09:31:56+05:30

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం 8 వేలు దాటింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8,175

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం 8 వేలు దాటింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8,175 మంది మరణించారు. దేశంలో అనేక మరణాలను చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ వారం, వచ్చే వారం చాలా కఠినమైన వారాలుగా ఆయన పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో వ్యాప్తంగా 3,01,902 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికన్లు భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని ఆపేందుకు ఇదొక్కటే మార్గమని చెబుతున్నారు. కాగా.. వైట్ హౌస్ అధికారులు అమెరికాలో మొత్తంగా లక్ష మంది వరకు చనిపోతారని అంచనా వేస్తున్నట్టు గత వారం తెలిపారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించకపోతేనే ఇలాంటి వినాశనం చూడాల్సి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ ఆసుపత్రులలో వెంటిలేటర్లు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఓరెగాన్ నుంచి 140 వెంటిలేటర్లు తెచ్చుకున్నట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో తెలిపారు. చైనా మరో వెయ్యి వెంటిలేటర్లను ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. పీపీఈలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి పెట్టి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు కోరుతున్నారు.

Updated Date - 2020-04-05T09:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising