ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ విమాన ప్రమాదం: మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన వివిధ దేశాలు!

ABN, First Publish Date - 2020-08-09T03:40:02+05:30

కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు స్పందించాయి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించాయి. ఈ మేరకు భా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు స్పందించాయి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించాయి. ఈ మేరకు భారత్‌లో ఉన్న ఆయా దేశాల రాయబారులు ట్విట్టర్ పోస్ట్ చేశారు. విమాన ప్రమాదం దిగ్భ్రంతికి గురిచేసినట్లు వారు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. ఈ విషాద ఘటన గురించి విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’లో భాగంగా భారత ప్రభుత్వం ఇండియాకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు దుబాయ్ నుంచి కేరళకు చేరుకున్న విమానం.. ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 


Updated Date - 2020-08-09T03:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising