ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లాండ్‌లోని షాప్‌లలో మాస్క్ తప్పనిసరి.. ఈ నిబంధన ఉల్లంఘిస్తే..!

ABN, First Publish Date - 2020-07-16T06:34:07+05:30

కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాప్‌లలో మాస్క్ ధరించడాన్ని తప్పని సరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ స్థాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాప్‌లలో మాస్క్ ధరించడాన్ని తప్పని సరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే  భారీ స్థాయిలో జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో బ్రిటన్‌లో కొవిడ్-19 కేసులు భారీగా నమోదవ్వడంతో.. మహమ్మారిని కట్టడి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేసుల సంఖ్య కాస్త తగ్గిన నేపథ్యంలో.. బ్రిటన్ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించింది. అయితే మహమ్మారి మరోసారి విజృంభించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంగ్లాండ్‌లోని షాప్‌లలో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే అత్యధికంగా సుమారు 100 పౌండ్ల(రూ.9,470) జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆదేశాలు జూలై 24 నుంచి అమలులోకి రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. కాగా.. బ్రిటన్‌లో నిన్న కొత్తగా 398 కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 138 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో 2.91లక్షల మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 45వేల మంది మరణించారు. 


Updated Date - 2020-07-16T06:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising