ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో తానా ఆధ్వర్యంలో హెల్మెట్‌ల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-07T01:51:49+05:30

హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో వాహనదారులను చైతన్య పరిచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో వాహనదారులను చైతన్య పరిచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2వేల హెల్మెట్‌లను వాహనదారులకు అందించింది. హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా విజయవాడకు చెందిన సుదీక్షణ్ ఫౌండేషన్ నేతృత్వంలో ఆదివారం రోజు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చేతుల మీదుగా హెల్మెట్‌లు, రగ్గులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అంతేకాకుండా తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్లురి, ఛైర్మన్ నిరంజన్ శృంగవరపునకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సుదీక్షణ్ ఫౌండేషన్ ఫౌండర్ చిగురుపాటి విమల, బషీర్ షేక్, కాకాని తరుణ్ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-07T01:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising