ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రెండు దేశాలకు మధ్య ఉన్న సంబంధాలకు బీటలువారాయి..!

ABN, First Publish Date - 2020-07-13T13:51:00+05:30

ఐదేళ్ల క్రితం విషయం.. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌ చైనా-యూకే సంబంధాల్లో స్వర్ణయుగం మొదలైందంటూ పొంగిపోయారు. చైనాతో రూ.వేల కోట్ల ఒప్పందాల్ని కుదుర్చుకున్నారు. ఐదేళ్లు గడిచాయి. కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పదవిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హాంకాంగ్‌ విషయంలో రాజుకున్న వివాదం

లండన్‌, జూలై 12: ఐదేళ్ల క్రితం విషయం.. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌ చైనా-యూకే సంబంధాల్లో స్వర్ణయుగం మొదలైందంటూ పొంగిపోయారు. చైనాతో రూ.వేల కోట్ల ఒప్పందాల్ని కుదుర్చుకున్నారు. ఐదేళ్లు గడిచాయి. కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పదవిలోకి వచ్చారు. అటువైపు చైనా మాత్రం తనకు అలవాటైన రీతిలో బ్రిటన్‌తో హాంకాంగ్‌ విషయంలో ఉన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. కొత్తగా జాతీయ భద్రత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో.. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. చైనా చర్యకు ప్రతిస్పందనగా.. హాంకాంగ్‌లో ఉన్న సుమారు 30 లక్షల మందికి తమ దేశ పౌరసత్వం ఇస్తామని బోరిస్‌ ప్రకటించారు. ఆ దేశ సాంకేతిక సంస్థ హువే పట్ల కూడా కఠినంగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు జారీ చేశారు. ఆయన ప్రకటన పట్ల చైనా తీవ్రంగా స్పందించింది. తమను శత్రుదేశంగా భావించడం మంచిది కాదని.. భద్రతాకారణాలను బూచిగా చూపి, హువేను బ్రిటన్‌ టెలికాం మౌలికవసతుల్ని నుంచి తప్పిస్తే.. ‘తీవ్ర పరిణామాలను’ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.


Updated Date - 2020-07-13T13:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising