ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో 17 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-05T09:21:51+05:30

యూకేలో కరోనా కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో యూకే వ్యాప్తంగా 16,298 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: యూకేలో కరోనా కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో యూకే వ్యాప్తంగా 16,298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,90,432కు చేరుకుంది. మరోపక్క ఒకేరోజు కరోనా కారణంగా మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 60,617గా ఉంది. యూకేలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికి.. గత కొద్ది రోజులుగా కేసులలో తగ్గుదల కనపడుతోంది. యూకేలో కరోనా వైరస్ రీప్రొడక్షన్ నెంబర్ 0.8-1.0 మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెవల్ 1.0ను అధిగమిస్తే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే యూకే ప్రభుత్వం మూడు జోన్లు లేదా లెవల్స్ కింద ప్రాంతాలను విభజించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మూడో లెవల్ కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో బార్లు, రెస్టారెంట్లు తదితర వ్యాపారాలపై పూర్తిగా ఆంక్షలు కొనసాగుతాయి. ఈ విధంగా వ్యాప్తి ఎక్కువగా ఉన్న చోటు ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ కరోనాను కొంతవరకు నియంత్రించగలుగుతోంది.

Updated Date - 2020-12-05T09:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising