ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఒక్క దేశం నుంచి వచ్చేవారు మాత్రం.. క్వారంటైన్‌లో ఉండాల్సిందే: యూకే

ABN, First Publish Date - 2020-07-05T00:40:56+05:30

ప్రపంచదేశాల నుంచి యూకే వచ్చే వారు ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ప్రపంచదేశాల నుంచి యూకే వచ్చే వారు ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని యూకే ప్రభుత్వం వెల్లడించింది. 59 దేశాలపై విధించిన ఈ ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త నిబంధనలు జులై 10 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పింది. అయితే.. అమెరికా నుంచి వచ్చే వారిపై మాత్రం నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలో నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ కారణంగానే అమెరికా నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల యూరోపియన్ యూనియన్(ఈయూ) సైతం అమెరికా నుంచి వచ్చే వారిని తమ దేశాల్లోకి రానిచ్చేది లేదంటూ స్ఫష్టం చేసింది. కాగా.. యూకేలో ఇప్పటివరకు 2,84,276 కరోనా కేసులు నమోదుకాగా.. 44,131 మంది మృత్యువాతపడ్డారు. మరోపక్క అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 29 లక్షల కేసులు నమోదు కాగా.. లక్షా 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Updated Date - 2020-07-05T00:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising