ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్ మొదటి వారంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్?

ABN, First Publish Date - 2020-10-26T21:47:22+05:30

యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 మొదటి బ్యాచ్ వ్యాక్సిన్‌ను లండన్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 మొదటి బ్యాచ్ వ్యాక్సిన్‌ను లండన్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సిద్దంగా ఉండాలని ఈ ఆసుపత్రికి ఆదేశాలు వచ్చినట్టు యూకేకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సోమవారం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ మొదటగా బయటకు వచ్చే అవకాశమున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ కూడా ముందుగా ఈ వ్యాక్సిన్ పొందే అవకాశముందని చెబుతున్నారు.

Updated Date - 2020-10-26T21:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising