ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత వైద్యుల సేవలను ప్రశంసించిన బ్రిటన్..!

ABN, First Publish Date - 2020-07-11T01:29:26+05:30

కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఇండియన్ డాక్టర్లు, వైద్య సిబ్బందిని బ్రిటన్ ప్రశంసించింది. పూర్తి వివరాల్లోకి వెళి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఇండియన్ డాక్టర్లు, వైద్య సిబ్బందిని బ్రిటన్ ప్రశంసించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో ఆ దేశ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ వర్చువల్‌‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎస్‌లో భారతీయుల సేవలను కొనియాడారు. ‘కొవిడ్-19 ప్రపంచానికి సవాల్ విసిరింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భారత్‌తో కలిసి మహమ్మారిపై  పోరాడుతున్నందుకు గర్వపడుతున్నాం’అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘దాదాపు 25వేల మంది నిపుణులైన ఇండియన్ డాక్టర్లు విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్‌లో సేవలందిస్తున్నారు. వారి సహకారాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నాం’అని తెలిపారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో పారాసెటమల్ మాత్రలు అందించి సాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. కాగా.. బ్రిటన్‌లో కరోనా బాధితులకు వైద్యం చేస్తూ పదుల సంఖ్యలో ఇండియన్ డాక్టర్లు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా బ్రిటన్ ప్రభుత్వ పిలుపు మేరకు.. పదవీ విరమణ పొందిన డాక్టర్లు కూడా ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్యం చేయడానికి ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.87లక్షల మంది కరోనా బారినపడగా.. ఇందులో 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-11T01:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising