ఎయిపోర్టులోనే 22 మంది భారతీయులు.. యూఏఈ కీలక ప్రకటన!
ABN, First Publish Date - 2020-03-28T01:35:25+05:30
కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 25వేల మంది మరణించారు. అయితే ఇప్ప
దుబాయి: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 25వేల మంది మరణించారు. అయితే ఇప్పటికే కరోనా కట్టడికి నడుంబిగించిన ప్రపంచ దేశాలు.. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా భారతప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమానాలను రద్దు చేయడంతోపాటు ఏప్రిల్15 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీని ప్రభావం.. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చే వారిపై పడింది. అంతర్జాతీయ విమానాలకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో దాదాపు 22 మంది భారతీయులు దుబాయిలోని విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ కీలక ప్రకటన చేసింది. విమానాశ్రాయల్లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశాలకు తరలించేందుకు.. ఆయా దేశాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు వెల్లడింది. కాగా.. ఈ విషయంపై దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం అధికారులు స్పందించారు. యూఏఈతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 22 మందిని భారత్‌కు తరలించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. అయితే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-03-28T01:35:25+05:30 IST