ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో అన్ని విమాన సర్వీసులు బంద్ !

ABN, First Publish Date - 2020-03-23T15:46:45+05:30

కరోనావైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: కరోనావైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు అన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ జాతీయ అత్యవసర, సంక్షోభం మరియు విపత్తుల నిర్వహణ శాఖలు... సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) అధికారులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, అత్యవసర తరలింపు విమానాలు, కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని సీఏఏ పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసుల ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా సీఏఏ తెలిపింది. రెండు వారాల తర్వాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన సమయంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది, విమానాశ్రయ అధికారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఐసోలేషన్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని సీఏఏ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-03-23T15:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising