ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు వారాలపాటు యూఏఈలో మాల్స్ క్లోజ్ అంశంపై వివరణ వచ్చేసింది!

ABN, First Publish Date - 2020-07-06T16:55:34+05:30

యూఏఈలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తుందని.. మాల్స్ అన్నీ రెండు వారాలపాటు మూతపడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తుందని.. మాల్స్ అన్నీ రెండు వారాలపాటు  మూతపడుతాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజలు మాల్స్ వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ స్పందించింది. యూఏఈలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాల్స్ కూడా మూతపడవని తేల్చి చెప్పింది. మాల్స్ మూతపడతాయంటూ సోషల్ మీడియాలో  ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని షేర్ వారికి జైలు శిక్ష, జరిమానా తప్పదంటూ హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. యూఏఈలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి, క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు యూఏఈ వ్యాప్తంగా మాల్స్ మూతపడుతాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.


Updated Date - 2020-07-06T16:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising