ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో ఆగని కొవిడ్ ఉధ‌ృతి !

ABN, First Publish Date - 2020-09-20T13:30:34+05:30

ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు యూఏఈలో కూడా విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు యూఏఈలో కూడా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ ఉధ‌ృతి పెరుగుతుండటం అధికారులకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా 103,000 కరోనా పరీక్షలు నిర్వహించగా... 809 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 84,242కు చేరింది. అలాగే నిన్న 722 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీలు 73,512కు చేరాయి. కాగా, ఇప్పటివరకు 404 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 10,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8.5 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. అయితే, ఒకవైపు ప్రతిరోజు భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న... మరోవైపు డైలీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఆరోగ్యశాఖ అధికారులు సూచించిన ముందు జాగ్రత్తచర్యలను ప్రజలు బేఖాతరు చేయడం కూడా కొత్త కేసుల పెరుగుదలకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

Updated Date - 2020-09-20T13:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising