యూఏఈలో కొనసాగుతున్న మహమ్మారి విజృంభణ!
ABN, First Publish Date - 2020-09-14T15:20:52+05:30
యూఏఈలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా.. ఆదివారం రోజు యూఏఈ
అబుధాబి: యూఏఈలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా.. ఆదివారం రోజు యూఏఈ వ్యాప్తంగా 84వేలపైగా కొవిడ్ టెస్ట్‌లు చేయగా.. సుమారు 640 మంది మహమ్మారి బారినపడినట్లు తెలిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 468 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయన్నారు. కాగా.. యూఏఈ ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 80వేలకు చేరువైంది. ఇందులో సుమారు 399 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 9వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కొవిడ్ సోకిన ఓ వ్యక్తి దుబాయిలో క్వారెంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు. బహిరంగ ప్రదేశాల్లో కాఫీ తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్పందించిన దుబాయి పోలీసులు.. అతనికి 50,000దిర్హామ్‌ల జరిమానా విధించారు.
Updated Date - 2020-09-14T15:20:52+05:30 IST