యూఏఈలో 391 కొత్త కేసులు.. 143 రికవరీలు..
ABN, First Publish Date - 2020-08-22T14:47:45+05:30
వారం రోజులుగా యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
యూఏఈ: వారం రోజులుగా యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రికవరీలు తగ్గుతున్నాయి. శుక్రవారం కూడా 391 కొత్త కేసులు నమోదు కాగా... 143 రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 66,193కు చేరితే... మొత్తం రికవరీలు 58,296 అయ్యాయి. కాగా, ఇప్పటికే 370 మంది కోవిడ్-19కు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ప్రతిరోజు భారీ సంఖ్యలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఆరు మిలియన్లకు పైగా కరోనా పరీక్షలు పూర్తి చేసింది.
Updated Date - 2020-08-22T14:47:45+05:30 IST