ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో అంత‌కంత‌కు పెరుగుతున్న రిక‌వ‌రీలు !

ABN, First Publish Date - 2020-08-08T17:07:07+05:30

మ‌హ‌మ్మారి క‌రోనా నుంచి కోలుకుంటున్న యూఏఈలో రిక‌వ‌రీలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: మ‌హ‌మ్మారి క‌రోనా నుంచి కోలుకుంటున్న యూఏఈలో రిక‌వ‌రీలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. క్ర‌మంగా పాజిటివ్ కేసులు త‌గ్గి... కోలుకుంటున్న వారు పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 90 శాతం దాటింద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం కూడా దేశ‌వ్యాప్తంగా 216 కొత్త కేసులు న‌మోదైతే... 276 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ సోకిన వారి సంఖ్య 62,061కు చేరితే... మొత్తం రిక‌వ‌రీలు 56,015 అయ్యాయి. ఇక నిన్న సంభ‌వించిన రెండు మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టికే 356 మందిని ఈ వైర‌స్ క‌బ‌ళించింది. ప్ర‌స్తుతం దేశంలో 5,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


మ‌రోవైపు క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డి కోసం యూఏఈ ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. శుక్ర‌వారం కూడా దేశ‌వ్యాప్తంగా 61,978 కోవిడ్ టెస్టులు చేసిన ఆరోగ్య‌శాఖ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మిలియ‌న్ల‌కు పైగా ప‌రీక్ష‌లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కోవిడ్ ఇప్ప‌టికే 7.24 ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కోటి 95 లక్ష‌ల మందికి ప్ర‌బ‌లింది.   

Updated Date - 2020-08-08T17:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising