ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో కొవిడ్ ఉధృతి.. 90వేలకు చేరిన కేసులు

ABN, First Publish Date - 2020-09-27T12:59:51+05:30

ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్‌ను కూడా వణికిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్‌ను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అంతకంతకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వరుసగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 90వేల మార్కును దాటింది. శనివారం దేశవ్యాప్తంగా 98,168 కొవిడ్ టెస్టులు నిర్వహించగా 1,078 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 90,618కు చేరింది. నిన్న 857 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 79,676 అయ్యాయి. అలాగే ఇప్పటికే 411 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 10,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ విస్తృతంగా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9.2 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. అయినా రోజురోజుకు కొత్త కేసులు కేసులు పెరుగుతుండడం అధికారులను కలవర పెడుతోంది. ప్రజలు ముందు జాగ్రత్తచర్యలను పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రణ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తున్న వారిలో మార్పు రావడంలేదని వాపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.  

Updated Date - 2020-09-27T12:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising