ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో ఆగని కొవిడ్ విజృంభణ..!

ABN, First Publish Date - 2020-09-26T13:17:00+05:30

యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 92వేల కరోనా పరీక్షల్లో 1,008 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 89,540కి చేరింది. అలాగే నిన్న 882 మంది మహమ్మారిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 78,819 అయ్యాయి. శుక్రవారం ఇద్దరు కరోనా కాటుకు బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం దేశంలో 10,312 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు 80-90వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9.13 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ఒకవైపు భారీగా కరోనా పరీక్షలు చేస్తున్న మరోవైపు కొత్త కేసులు అంతకంతకు పెరుగుతుండడం ఆరోగ్యశాఖ అధికారులను కలవర పెడుతోంది. అయితే, యూఏఈలో 90 శాతం రికవరీ రేటు, కేవలం 0.5శాతం మరణాల రేటు ఉండడం కాస్తా ఊరటనిచ్చే విషయం. కాగా, ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు బేఖాతరు చేయడంతోనే కొత్త కేసులు పెరుగుతున్నాయని అధికారులు వాపోతున్నారు. 

Updated Date - 2020-09-26T13:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising