ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో లక్ష మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

ABN, First Publish Date - 2020-10-07T12:35:14+05:30

యూఏఈలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. వారం పదిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. వారం పదిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో తాజాగా యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 102,379 కరోనా పరీక్షల్లో 1,061 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 100,794కు చేరింది. నిన్న ఒకేరోజు 1,146 మంది మహమ్మారిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం రికవరీలు 90,556కు చేరగా... మరణాలు 435 అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 9,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది యూఏఈ. అయినా ప్రతిరోజు కొత్త కేసులు పెరుగుతుండడం ఆరోగ్యశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 10.2 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.   

Updated Date - 2020-10-07T12:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising