ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్ 23 నుంచి విదేశీ ప్ర‌యాణాల‌కు యూఏఈ గ్రీన్ సిగ్న‌ల్

ABN, First Publish Date - 2020-06-16T18:27:15+05:30

క‌రోనా మ‌హ‌మ్మారి ఆంక్ష‌ల‌ నేప‌థ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: క‌రోనా మ‌హ‌మ్మారి ఆంక్ష‌ల‌ నేప‌థ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 23 నుంచి దేశ పౌరుల‌ను విదేశాల‌కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మ‌రియు ఇంట‌ర్నెష‌న‌ల్ కోఆప‌రేష‌న్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఈఎంఏ) సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ప్ర‌భుత్వం అనుమ‌తి పొంది.. ఎంపిక కాబ‌డిన పౌరులు, నివాసితుల‌ను కొన్ని గమ్యస్థానాలకు వెళ్లడానికి యూఏఈ అనుమ‌తించ‌నుంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. జ‌ర్నీ స‌మ‌యంలో ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నియంత్ర‌ణకు సంబంధించిన‌ నియమ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ‌దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూఏఈ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ వెల్ల‌డించ‌నుంది.     

Updated Date - 2020-06-16T18:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising