ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిట్ వీసాదారుల‌కు యూఏఈ 30 రోజుల డెడ్ ‌లైన్ !

ABN, First Publish Date - 2020-07-14T18:07:41+05:30

విజిటింగ్ వీసాపై త‌మ దేశానికి వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు యూఏఈ ప్ర‌భుత్వం 30 రోజుల డెడ్ లైన్ విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: విజిటింగ్ వీసాపై త‌మ దేశానికి వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు యూఏఈ ప్ర‌భుత్వం 30 రోజుల డెడ్ లైన్ విధించింది. నెల రోజుల్లోగా విజిట్ వీసాల‌ను రెన్యూవ‌ల్ చేసుకోవాల‌ని ఆదేశించింది. లేనిప‌క్షంలో దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. ఇక వీసాల రెన్యూవ‌ల్‌పై యూఏఈ తాజాగా కీల‌క సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో గ‌డువు ముగిసిన వీసాల‌ను త‌క్ష‌ణ‌మే రెన్యూవ‌ల్ చేసుకోవాల‌ని తెలిపింది. దీనికి సంబంధించి ఫెడ‌ర‌ల్ అథారిటీ ఫ‌ర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) ద‌ర‌ఖాస్తుల‌ను జూలై 12 నుంచి స్వీక‌రిస్తున్న‌ట్లు పేర్కొంది. కాగా... ప్ర‌వాసుల‌కు వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవ‌ల్‌కు సంబంధించి మూడు నెల‌ల గ్రేస్ పీరియ‌డ్ ఇచ్చింది. ఇక యూఏఈలో విజృంభిస్తున్న మహమ్మారి క‌రోనా వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు 55,198 మందికి ప్ర‌బ‌లింది. 334 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 

Updated Date - 2020-07-14T18:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising