ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో నాలుగు మిలియ‌న్లకు పైగా కోవిడ్ టెస్టులు...

ABN, First Publish Date - 2020-07-14T15:17:14+05:30

ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు గ‌ల్ఫ్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు గ‌ల్ఫ్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియాలో కోవిడ్‌-19 క‌ల్లోలం సృష్టిస్తోంది. కాగా, యూఏఈలో క‌రోనా ప్ర‌భావం గ‌త కొన్ని రోజులుగా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం కాస్తా ఊర‌ట‌నిచ్చే విష‌యం. దీనికి కార‌ణం దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌డ‌మే. ఇప్ప‌టికే నాలుగు మిలియ‌న్లకు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది. ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు ఆరు మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. 


ఇక సోమ‌వారం నిర్వ‌హించిన 34,478 టెస్టుల్లో 344 కేసులు పాజిటివ్‌గా వ‌చ్చాయని, దీంతో యూఈఏ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 55,198 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌తినిధి డా. ద‌హాక్‌ తెలియ‌జేశారు. మ‌రో 373 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రిక‌వ‌రీలు 45,513కు చేరాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 9,351 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్ప‌టికే 334 మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది.    

Updated Date - 2020-07-14T15:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising