ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హవాలా కేసులో ఇద్దరు భారతీయులకు 12 ఏళ్ల జైలుశిక్ష.. స్కాట్లాండ్‌లో..

ABN, First Publish Date - 2020-05-31T03:29:52+05:30

మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు భారతీయులకు స్కాట్లాండ్ కోర్టు 12 ఏళ్ల జైలుశి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎడిన్‌బర్గ్: మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు భారతీయులకు స్కాట్లాండ్ కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..  2.4 మిలియన్ పౌండ్ల(రూ. 22 కోట్ల 37 లక్షలు) మనీ లాండరింగ్ కేసులో విజయ్ కుమార్ కృష్ణస్వామి(32), చంద్రశేఖర్ నల్లయన్(44) గతేడాది అరెస్ట్ అయ్యారు. తమ బ్యాంకు ఐపీ అడ్రస్‌ల నుంచి వివిధ బిజినెస్ అకౌంట్లను అనుమానాస్పద వ్యక్తులు యాక్సెస్ చేస్తున్నారంటూ బార్క్‌లేస్ బ్యాంకు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు విజయ్ కుమార్ కృష్ణస్వామిని అరెస్ట్ చేశారు. విజయ్ కుమార్ దగ్గర అనేక బ్యాంకు అకౌంట్లకు, వివిధ వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్ కుమార్ ఫోన్‌లో దొరికిన సమాచారంతో చంద్రశేఖర్ నల్లయన్(44) కూడా ఇందులో పాలుపంచుకున్నట్టు పోలీసులు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. హవాలా డబ్బును ఎక్కడికి పంపాలో చంద్రశేఖర్ విజయ్ కుమార్‌కు సూచిస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలు వీళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. కాగా.. ఈ కేసు కోర్టులో నడుస్తూ రాగా.. తాజాగా ఇద్దరికి కలిపి 12 ఏళ్ల తొమ్మిది నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది.

Updated Date - 2020-05-31T03:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising