ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ కేసులో భారత సంతతి వ్యక్తులకు జైలు!

ABN, First Publish Date - 2020-05-30T20:56:42+05:30

మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు  జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నల్లయాన్(44).. 2.4 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ.22.38 కోట్ల) మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు స్కాట్‌లాండ్‌కు చెందిన ఎకనమిక్ క్రైమ్ యూనిట్ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా వీరిద్దరూ మరో 1.6 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 14.91 కోట్ల) మనీ లాండరింగ్‌కు పాల్పడే ప్రయత్నంలో ఉన్నట్లు ఎకనమిక్ క్రైమ్ యూనిట్ తన విచారణలో గుర్తించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది. అంతేకాకుండా ఇద్దరికీ కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షను విధించింది. ఇందులో చంద్రశేఖర్ నల్లయాన్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడగా.. విజయ కుమార్ కృష్ణసామికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. 


Updated Date - 2020-05-30T20:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising