ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మరోమారు కాల్పుల మోత

ABN, First Publish Date - 2020-07-06T08:32:20+05:30

అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజుల కాల్పుల మోత మోగింది. సౌత్ కెరోలినాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రీన్‌విల్లే, సౌత్ కెరోలినా: అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కాల్పుల మోత మోగింది. సౌత్ కెరోలినాలోని గ్రీన్‌విల్లేలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో కాల్పుల కలకలం రేగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ చేసుకుంటున్న వారిపై దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మరో పది మంది తీవ్ర గాయాలపాలవడంతో... వారికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  శనివారం రాత్రి నైట్‌క్లబ్‌లో దాదాపు 200 మంది సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు ఒక్కసారిగా అక్కడి వారిపై కాల్పులు జరిపారు. కాల్పులు మోత విన్న పోలీసులు వెంటనే నైట్‌క్లబ్‌కు చేరుకోగా.. అప్పటికే దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది దూరంలోనే అంతకుముందు రోజు కూడా కాల్పుల కలకలం రేగడంతో.. పోలీసులు ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒకరేనని అనుమానిస్తున్నారు.

Updated Date - 2020-07-06T08:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising