ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ సలహాదారుడికి షాకిచ్చిన ట్విట్టర్!

ABN, First Publish Date - 2020-10-19T20:51:05+05:30

ట్రంప్ సలహాదారుడికి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్ ప్రాధాన్యతను తగ్గిస్తూ పెట్టిన పోస్ట్‌ను తొలగించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అసత్య ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ట్రంప్ సలహాదారుడికి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్ ప్రాధాన్యతను తగ్గిస్తూ పెట్టిన  పోస్ట్‌ను తొలగించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అసత్య ప్రచారాలను అడ్డుకోవడంపై ట్విట్టర్ దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ట్వీట్లపట్ల ట్విట్టర్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే  ట్రంప్‌ సలహాదారుడిగా పని చేస్తున్న డాక్టర్ స్కాట్ అట్లాస్.. మాస్క్ ప్రాముఖ్యతను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆదివారం రోజు తొలగించింది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని మాస్క్‌లు అడ్డుకుంటాయా? లేదు’ అంటూ స్కాట్ అట్లాస్ శనివారం రోజు ట్వీట్ చేశారు.


ఆయన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవపట్టించేవిగా ఉండటంతో ట్విట్టర్ చర్యలు తీసుకుంది. మాస్క్ విషయంలో స్కాట్ అట్లాస్ చేసిన వ్యాఖ్యలను తొలగించింది. ఇదిలా ఉంటే.. స్కాట్ అట్లాస్ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 8లక్షల మంది కరోనా బారినపడి, సుమారు 2.18లక్షల మంది ప్రాణాలు కోల్పోయినా.. ట్రంప్, అతని అధికారుల్లో మాత్రం మార్పు రాలేదని ఆరోపించారు. మహమ్మారిని తేలిగ్గా తీసుకుంటూ.. కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వీటిని మానుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-10-19T20:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising