ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ భారత్‌కు పంపనున్న వెంటిలేటర్ల ధర ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2020-05-18T23:22:40+05:30

భారత్‌కు 200 మొబైల్ వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత్‌కు 200 మొబైల్ వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ‘భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. కరోనాపై పోరాటంలో, వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా - భారత్‌లు కలిసి పనిచేస్తున్నాయి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.  కాగా.. అమెరికా పంపనున్న ఒక్కో మొబైల్ వెంటిలేటర్ ధర 13 వేల డాలర్ల(రూ. 9.6 లక్షలు)ని రిపోర్ట్ చెబుతోంది. మే చివరి నాటికి లేదా జూన్ మొదటి వారంలో ఈ వెంటిలేటర్లు భారత్‌కు చేరనున్నాయి. మొత్తం 200 మొబైల్ వెంటిలేటర్లకు గాను 2.6 మిలియన్ డాలర్ల(రూ. 19.2 కోట్ల) ఖర్చు కానుంది. ఈ ఖర్చును యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) భరించనుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్ ట్వీట్‌పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘వెంటిలేటర్లను పంపుతున్నందుకు ధన్యవాదములు. ఈ మహమ్మారిపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కొవిడ్-19 నుంచి విముక్తి పొందేందుకు, ప్రపంచాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేసేందుకు దేశాలుగా మనం కలిసి పనిచేయాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో ట్రంప్ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం 5 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను అమెరికాకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. 

Updated Date - 2020-05-18T23:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising