ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష మరణాలపై విచారం వ్యక్తం చేసిన ట్రంప్..!

ABN, First Publish Date - 2020-05-29T05:39:55+05:30

కరోనా వైరస్ అగ్రరాజ్యంలో కరాళ నృత్యం చేస్తోంది. అమెరికాలో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలో అమెరికా అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యంలో కరాళ నృత్యం చేస్తోంది. అమెరికాలో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్ వేదికగా స్పందిచారు. అమెరికాలో లక్ష మరణాలు సంభవించడంపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘అత్యంత విచారకరమైన మైలురాయిని చేరుకున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. అమెరికాలో మొదటి కరోనా కేసు జనవరిలో నమోదవ్వగా.. మొదటి మరణం ఫిబ్రవరి 29న సంభవించింది. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 17.57లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. మరణాల సంఖ్య లక్ష దాటింది. ఇందులో అత్యధికంగా న్యూయార్క్‌లోనే దాదాపు 30వేల మంది కరోనా కారణంగా మరణించారు. అత్యధిక కరోనా కేసులు, మరణాల సంఖ్య నమోదైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 


Updated Date - 2020-05-29T05:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising