ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్

ABN, First Publish Date - 2020-07-09T05:42:00+05:30

టిక్‌టాక్ సహా చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. అమెరికా కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే అం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: టిక్‌టాక్ సహా చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. అమెరికా కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. ‘అదో పెద్ద వ్యాపారం. కరోనా వైరస్‌తో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసు. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికి చైనా చేసిన పని అవమానకరమైంది. టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న మార్గాల్లో ఇదొకటి’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. టిక్‌టాక్‌పై నిషేధాన్ని విధించే అంశాన్ని పరిశీస్తున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి కూడా ఇప్పటి ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 3 మిలియన్లకు చేరువలో ఉంది. దాదాపు 1.30లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-09T05:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising