ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు గాంధీ విగ్రహాన్ని కూడా వదల్లేదు: ట్రంప్

ABN, First Publish Date - 2020-09-19T23:51:06+05:30

శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో చెలరేగిన ఆందోళనలలో నిరసనకారులు వాషింగ్టన్ డీసీలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో చెలరేగిన ఆందోళనలలో నిరసనకారులు వాషింగ్టన్ డీసీలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. "ఆ 'దుండగుల ముఠా' చివరకు గాంధీ విగ్రహాన్ని కూడా వదల్లేదు. ఆయన కోరుకున్నది శాంతినే కదా. అయినా నిరసనకారులు తాము ఏం చేస్తున్నామో తెలియకుండా ఇలా విధ్వంసానికి పాల్పడ్డారు" అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మిన్నెసోటాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ... జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత నిరసనకారులు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేశారు. "మీకు తెలుసు 'దుండగుల ముఠా' అబ్రహం లింకన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ విగ్రహాన్ని తాకేముందు ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సింది. ఆ తర్వాత వారు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ విగ్రహాలపై కూడా దాడికి పాల్పడ్డారు. చివరకు గాంధీ విగ్రహాన్ని కూడా వదల్లేదు. గాంధీ కోరుకున్నది శాంతియే కదా. మరి వారు ఇలా ఎందుకు చేశారు. ఇలా మన గతాన్ని, చరిత్రను ధ్వంసం చేసేవారిని వదిలిపెట్టేది లేదు." అని ట్రంప్ అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష విధించే ఉత్తర్వులపై తాను సంతకం చేసినట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలియజేశారు.   


కాగా, మే 25న మిన్నియాపొలిస్‌లో శ్వేతజాతి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్‌‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో అమానుషంగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారి ఒకరు ఫ్లాయిడ్ మెడపై మోకాలితో నొక్కిపట్టడం వల్ల అతనికి ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అగ్రరాజ్యం నిరసనలతో అట్టుడికిపోయింది. ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా నల్లజాతీయులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే నిరసనకారులు వాషింగ్టన్‌లోని గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. 



Updated Date - 2020-09-19T23:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising