ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1918 ఫ్లూ వల్ల రెండో ప్రపంచ యుద్దం ముగిసింది: ట్రంప్

ABN, First Publish Date - 2020-08-12T05:04:55+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1917లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల రెండో ప్రపంచ యుద్దం ముగిసిందని అన్నారు. ఆ సమయంలో 50 లక్షల నుంచి కోటి మంది వరకు మరణించారని.. సైనికులు కూడా అనారోగ్యానికి గురయ్యారన్నారు. నిజానికి రెండో ప్రపంచ యుద్దం 1939 నుంచి 1945 వరకు జరిగింది. అంటే.. ట్రంప్ చెప్పిన నాటికి అసలు రెండో ప్రపంచ యుద్దం అనేదే మొదలుకాలేదు. అయితే ట్రంప్ మొదటి ప్రపంచ యుద్దం అనబోయి పొరపాటున రెండో ప్రపంచ యుద్దం అని చెప్పారని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే మొదటి ప్రపంచయుద్దం.. స్పానిష్ ఫ్లూ వచ్చిన 1918వ సంవత్సరంలోనే ముగిసింది. అయితే ట్రంప్ 1917లో వచ్చిన ఫ్లూ కారణంగా యుద్దం ముగిసినట్టు చెప్పారు. కానీ స్పానిష్ ఫ్లూ 1918లో వచ్చింది. అదే సంవత్సరం మొదటి ప్రపంచ యుద్దం ముగిసింది.  


Updated Date - 2020-08-12T05:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising