ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఠం కోసం.. ట్రంప్‌ మరో కుట్ర

ABN, First Publish Date - 2020-11-21T13:33:28+05:30

అధికార పీఠాన్ని వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ భారీ కుట్రకు సిద్ధమయ్యారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 270 మేజిక్‌ ఫిగర్‌ కోసం ఇంకా ప్రయత్నిస్తున్న ట్రంప్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 20: అధికార పీఠాన్ని వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ భారీ కుట్రకు సిద్ధమయ్యారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 270 మేజిక్‌ ఫిగర్‌ కోసం ఇంకా ప్రయత్నిస్తున్న ట్రంప్‌.. తాజాగా 46 స్థానాల్లో ఎన్నికలను వివాదాస్పదం చేయాలనుకున్నారు. శుక్రవారం మిషిగాన్‌కు చెందిన తన పార్టీ (రిపబ్లికన్‌) చట్టసభ్యులను వైట్‌హౌ్‌సకు పిలిపించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న 16 స్థానాల్లో.. బైడెన్‌-కమల హ్యారి్‌సకు ఓట్లు వచ్చిన విషయాన్ని నిర్ధారించకూడదని.. అవి తన ఖాతాలో పడ్డట్లుగానే గుర్తించాలని వారిని కోరారు. ఇదేవిధంగా.. పెన్సిల్వేనియాలోని 20 స్థానాలు, విస్కోన్సిన్‌లోని 10 స్థానాలను అక్రమంగా తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహం పన్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే.. ట్రంప్‌కు వచ్చిన స్థానాల సంఖ్య 232 నుంచి 278కి పెరుగుతుంది. ట్రంప్‌ చర్యలు సరికావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-11-21T13:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising