ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌మాస్క్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం: వైట్‌హౌస్ సెక్రటరి

ABN, First Publish Date - 2020-07-01T00:21:24+05:30

అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఫేస్‌మాస్క్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటివరకు ఫేస్‌మాస్క్‌తో ఎక్కడా కనిపించలేదు. ఆయన ఏ ర్యాలీకి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా ఫేస్‌మాస్క్ లేకుండానే వెళ్తున్నారు. దేశ అధ్యక్షుడే ఫేస్‌మాస్క్ ధరించకపోతే.. ఇక ప్రజలు దీన్ని ఏం పాటిస్తారని సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయంపై వైట్‌హౌస్ సెక్రటరి కేలై మెక్ఎనానిని మీడియా ప్రశ్నించింది. దీనిపై కేలై స్పందిస్తూ.. ఫేస్‌మాస్క్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని ట్రంప్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఫేస్‌మాస్క్ ధరించాలా వద్దా అనేది ట్రంప్ వ్యక్తిగత నిర్ణయమని.. ప్రతిఒక్కరికి కూడా అదే వర్తిస్తుందన్నారు. భద్రత కోసం ఏ నిర్ణయం అయితే సరైనదో అదే తీసుకోమని ట్రంప్ ప్రజలను ప్రోత్సహిస్తున్నట్టు కైలే పేర్కొన్నారు. ఫేస్‌మాస్క్ ధరించడం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని ట్రంప్ తనతో చెప్పినట్టు కైలే ఈ సందర్భంగా తెలియజేశారు.

Updated Date - 2020-07-01T00:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising