ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జో బైడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటూ ట్రంప్ డిమాండ్

ABN, First Publish Date - 2020-09-28T05:45:19+05:30

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. మంగళవారం జరగనున్న మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ ముందు కాని.. డిబేట్ ముగిసిన తరువాత కాని జో బైడెన్ టెస్ట్‌కు వెళ్లాలని ఆయన తెలిపారు. తాను కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకునేందుకు సిద్దమన్నారు. జో బైడెన్ గతంలో ఏ ఒక్క డిబేట్‌లో కూడా ఆకట్టుకునే విధంగా మాట్లాడలేదని.. కొద్ది రోజులుగా మాత్రం ఆయన డిబేట్లలో అద్భుతమైన పనితీరు కనబడుతోందన్నారు. ఈ వ్యత్యాసానికి డ్రగ్స్ కారణమా? అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


గతంలో కూడా ట్రంప్ ఈ విధంగానే జో బైడెన్‌పై పలు ఆరోపణలు చేశారు. జో బైడెన్ మానసిక స్థితి కూడా బాగోలేదని.. ఇటువంటి వ్యక్తి దేశాధ్యక్షుడిగా అనర్హుడంటూ ట్రంప్ గత కొద్ది రోజుల నుంచి ప్రచారంలో భాగంగా చెప్పుకొస్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను జో బైడెన్ ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో సైతం ట్రంప్ తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తూ అబద్దాలు చెబుతారని అనుకుంటున్నట్టు జో బైడెన్ శనివారం చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.  

Updated Date - 2020-09-28T05:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising