ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్, చైనాల మధ్య వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!

ABN, First Publish Date - 2020-09-25T20:43:42+05:30

భారత్ - చైనాల మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత్ - చైనాల మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్వేతసౌధంలో గురువారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్ - చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ‘భారత్ - చైనా దేశాల మధ్య నెలకొని ఉన్న తీవ్రమైన వివాదం గురించి నాకు తెలుసు. ఆ దేశాలు తమ సమస్యను పరిష్కరించుకుంటాయని భావిస్తున్నాను’ అని అన్నారు. అంతేకాకుండా.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తానని పునరుద్ఘాటించారు. ‘మేము పరిష్కరించగలితే.. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో కూడా ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-09-25T20:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising