ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవాంకా కోటిన్నర ఉద్యోగాల సృష్టికర్త: ట్రంప్

ABN, First Publish Date - 2020-04-09T02:44:12+05:30

అమెరికా వ్యాప్తంగా ఇవాంకా ట్రంప్ కోటిన్నర ఉద్యోగాలను సృష్టించినట్టు అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా ఇవాంకా ట్రంప్ కోటిన్నర ఉద్యోగాలను సృష్టించినట్టు అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. మంగళవారం అమెరికాలోని బిజినెస్ ప్రతినిధులతో ఫోన్‌లో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మొత్తంగా 15.2 కోట్ల మంది ఉపాధి పొందినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ట్రంప్ చెప్పిన లెక్కల బట్టి చూస్తే ఇందులో పది శాతం ఉద్యోగాలు కేవలం ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కారణంగానే వచ్చాయన్నమాట. ట్రంప్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. ఇవాంకా కొద్ది నెలల నుంచి ఓవరై టైమ్ పనిచేస్తూ 1.4 కోట్ల ఉద్యోగాలను సృషించారని గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ట్రంప్ అన్నారు. కాగా.. ఇవాంకా ట్రంప్ ఓ అడ్వైజరీ బోర్డ్‌కు కో-చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆ బోర్డ్ ద్వారా కోటిన్నర ఉద్యోగాలు వచ్చినట్టు మాత్రం ఎటువంటి సాక్ష్యాలు లేవు. కాగా.. కరోనా మహమ్మారి ప్రారంభం కాక ముందే అమెరికాలో 80 లక్షల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. మరి ఇందులో కూడా ఇవాంకా ట్రంప్ కృషి ఉన్నట్టేనా అని కొంత మంది ట్రంప్‌కు చురకలు అంటిస్తున్నారు.

Updated Date - 2020-04-09T02:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising