ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్‌.. అధికార బదిలీకి అంగీకారం

ABN, First Publish Date - 2020-11-25T09:49:59+05:30

మూడు వారాల తీవ్ర ప్రతిష్ఠంభన అనంతరం... అమెరికా కొత్త అధినేత ఎవరన్నది లాంఛనంగా ప్రకటితమైంది. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు దిగివచ్చారు. అధికార బదిలీకి తన ఆమోదముద్ర వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 24: మూడు వారాల తీవ్ర ప్రతిష్ఠంభన అనంతరం...  అమెరికా కొత్త అధినేత ఎవరన్నది లాంఛనంగా ప్రకటితమైంది. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు దిగివచ్చారు. అధికార బదిలీకి తన ఆమోదముద్ర వేశారు. దీంతో- దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ను గుర్తిస్తున్నట్లు, అధికార బదిలీ ప్రక్రియ ఆరంభిస్తున్నట్లు కీలకమైన సాధారణ సేవల పాలనా విభాగం (జీఎ్‌సఏ) మంగళవారంనాడు లాంఛనంగా ప్రకటించింది.


జనవరి 20న బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కూడా బాధ్యతలు చేపడతారు.  నిజానికి ఈ అధికారిక గుర్తింపు వచ్చేదాకా బైడెన్‌ ఆగలేదు. తన కేబినెట్లో, శ్వేతసౌధంలో, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఎవరెవరు ఉండాలో ఎంపిక చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఆయన కొత్త రక్షణ మంత్రిగా మిషేలీ ఫ్లర్నాయ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పెంటగాన్‌ను అంటే అమెరికా రక్షణ మంత్రిత్వశాఖను ఓ మహిళ  నిర్వహించడం ఇదే ప్రథమం. ఇక అంతర్గత భద్రతా విభాగ మంత్రిగా తొలిసారిగా ఓ ఇమిగ్రెంట్‌ను ట్రంప్‌ ఎంపిక చేశారు. క్యూబా మూలాలున్న లాటినో- ఎలజాండ్రో మేయోర్కా్‌సను ఈ పదవిని వరించనుంది. ట్రంప్‌ దిగిరావడానికి ప్రధాన కారణం... మరో రెండు స్వింగ్‌రాష్ట్రాలు మిషిగన్‌, పెన్సిల్వేనియా ఆయన చేజారడమే. పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో ఇక తనకు నిష్క్రమించడం తప్ప వేరే గత్యంతరం లేదని ట్రంప్‌ గ్రహించారు. బైడెన్‌ గెలిచారని ఎక్కడా అంగీకరించకుండా ఆయన అయిష్టంగానే అధికార బదిలీకి సమ్మతి తెలిపారు. 

Updated Date - 2020-11-25T09:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising