ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసనకారులతో పాటు మోకరిల్లిన కెనడా ప్రధాని

ABN, First Publish Date - 2020-06-07T09:27:19+05:30

అమెరికాలో తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ గత నెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: అమెరికాలో తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ గత నెల 25న మరణించిన విషయం విధితమే. జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతోంది. వేలాది మంది ఆందోళనకారులు అమెరికా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఒక్క అమెరికానే కాకుండా యూరప్ దేశాల్లో, కెనడా తదితర దేశాల్లోనూ జార్జ్ ఫ్లాయిడ్ మరణం పట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం కెనడాలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా హాజరయ్యారు. అంతేకాకుండా నిరసనకారులతో పాటు మోకరిల్లి ఆయన సంఘీభావం తెలిపారు. ‘బ్లాక్ లివ్స్ మేటర్’ పేరిట జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వేలాది మంది పొల్గొన్నారు. ప్రేమ, శాంతి టాపిక్‌లపై మాట్లాడిన వారిని జస్టిన్ ట్రూడో చప్పట్లతో అభినందించారు. జస్టిన్ ట్రూడో కార్యక్రమంలో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అనంతరం నిరసనకారులు పార్లమెంట్ బిల్డింగ్ సమీపంలో ఉన్న యూఎస్ ఎంబసీ వరకు ర్యాలీ చేపట్టారు. మరోపక్క ఒట్టావా పోలీస్ సర్వీస్ ఎక్కడా ఎటువంటి ఆందోళన తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. తమ దేశస్థుల కోపం, బాధను తాము అర్థం చేసుకోగలమని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-07T09:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising