ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు

ABN, First Publish Date - 2020-12-02T02:28:31+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమన్నారు. చదువుకున్న వారు అత్యధికంగా ఉండే హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరంలో ఓటింగ్ శాతం తగ్గడం బాధ కలిగించిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పని చేసిన స్థానిక, ఎన్నారై టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు. సోషల్ మీడియా బాధ్యులు వై.సతీష్ రెడ్డి, క్రిశాంక్, జగన్ తదితరులు క్రియాశీలకంగా పని చేశారని తెలిపారు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-02T02:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising