ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ

ABN, First Publish Date - 2020-07-07T02:51:31+05:30

ఒమన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ, డెక్కన్ వింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమన్, మస్కట్: ఒమన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ, డెక్కన్ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సంయుక్తంగా మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. జులై 1న ఈ విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు సమయానికి రాలేదు. దీంతో ఈ విమానం మస్కట్ నుంచి తెలంగాణకు వెళ్లలేకపోయింది. ఈ కారణంగా విమానంలో స్వదేశానికి వెళ్లాలనుకున్న భారతీయులు నిరాశ చెందారు. అయితే ఇదే సమయంలో నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలను సంప్రదించారు. విషయం తెలుసుకున్న మహేష్ బిగాల తక్షణమే స్పందించి సీఎం క్యాంప్ ఆఫీస్ వాళ్లతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే అనుమతులు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘నో అబ్జెక్షన్‌’ లేఖను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో.. మంగళవారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ఈ విమానం వెళ్లనుంది. కాగా.. ఈ విషయంలో వెంటనే స్పందించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, మహేష్ బిగాలకు, తమకు సహకరించిన ప్రభుత్వ ఆధికారులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





Updated Date - 2020-07-07T02:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising