ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ బ్యాగులు సర్దుకుని ఇంటికెళ్లే సమయం ఆసన్నమైంది: జో బైడెన్

ABN, First Publish Date - 2020-11-03T05:40:51+05:30

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ప్రచారానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచం మొత్తం ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరిక అధ్యక్ష పదవి ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సోమవారం ఒహాయో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘ట్రంప్ హయాంలో అమెరికా ఎవరూ ఊహించనన్ని గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ట్రంప్ తన బ్యాగులు సర్దుకుని ఇంటికెళ్లే సమయం ఆసన్నమైంది’ అంటూ ట్రంప్‌పై పలు విమర్శలు చేశారు. ‘ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలికాం. ట్వీట్లకు, కోపానికి, ద్వేషానికి, వైఫల్యాలకు, బాధ్యతారాహిత్యానికి కూడా ఇక ముగింపు’ అని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకువస్తానంటూ ఈ సందర్భంగా జో బైడెన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మరోపక్క రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అద‌ృష్టాన్ని పరీక్షించుకుంటున్న ట్రంప్ సైతం విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-03T05:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising