ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు తెలిపిన ప్రజలు!

ABN, First Publish Date - 2020-09-27T02:18:26+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ.. లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద శనివారం రోజు వేలాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ.. లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద శనివారం రోజు వేలాది మంది నిరసనకారులు సమావేశం అయ్యారు. లాక్‌డౌన్, సామాజిక దూరం తదితర నిబంధనలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడి చేరుకున్న లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు.. నిరసన కారులను చుట్టుముట్టారు. అయితే వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. చాలా మంది నిరసనకారులు మాస్కులు కూడా ధరించలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు.. నిరసనకారులు సమాజిక దూరం పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం వల్ల.. తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గత కొద్దివారాలుగా కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూని విధించింది. ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిరసనలు చోటు చేసుకున్నాయి. 


Updated Date - 2020-09-27T02:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising