ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మాస్క్ కరోనాను మట్టుపెడుతుంది..!

ABN, First Publish Date - 2020-06-18T05:37:33+05:30

కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన పరిశోధకులు కరోనాను మట్టుపెట్టే మాస్క్‌ను రూపొందించారు. సెల్‌ఫోన్ చార్జర్‌‌ను ఉపయోగించి మాస్క్‌ను వేడిచేయడం ద్వారా.. మాస్క్‌లో చేరిన వైరస్ నశిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ చార్జర్‌ను ఉపయోగించి మాస్క్‌లోకి విద్యుత్‌ను పంపినప్పుడు.. మాస్క్‌లో‌ని కార్బన్ ఫైబర్ లేయర్ 70 డిగ్రీ సెల్సియస్ వరకు వేడవుందని పేర్కొన్నారు. 70 డిగ్రీ సెల్సియస్ ఊష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ బతికే అవకాశం ఉండదని వివరిస్తున్నారు. అయితే మాస్క్ హీట్ కావడానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుందని వారు వెల్లడించారు. చార్జర్ ద్వారా 30 నిమిషాలపాటు మాస్క్‌లోని విద్యుత్‌ను పంపిన కొద్దిసమయానికి.. తిరిగి దాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 


Updated Date - 2020-06-18T05:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising