భర్త చెప్పిన ఆ ఒక్క మాటతో.. 41ఏళ్లుగా ఎంగిలి భోజనం పంపుతున్న భార్య..!
ABN, First Publish Date - 2020-12-12T02:51:00+05:30
పెళ్లైన మొదట్లో భర్త నోటి వెంట వచ్చిన చిన్న మాటను నాలుగు దశాబ్దాలు గడిచినా ఓ ఇల్లాలు మర్చిపోలేదు. 41 సంవత్సరాలుగా ఆమె ఎంగిలి చేసిన టిఫిన్ బాక్స్‌నే భర్తకు ఇచ్చి ఆఫీస్‌కు పంపుతోంది. దశాబ్దాలపా
టెక్సాస్: పెళ్లైన మొదట్లో భర్త నోటి వెంట వచ్చిన చిన్న మాటను నాలుగు దశాబ్దాలు గడిచినా ఓ ఇల్లాలు మర్చిపోలేదు. 41 సంవత్సరాలుగా ఆమె ఎంగిలి చేసిన టిఫిన్ బాక్స్‌నే భర్తకు ఇచ్చి ఆఫీస్‌కు పంపుతోంది. దశాబ్దాలపాటు ఈ విధంగా చేయడానికి గల కారణాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా నెజిటన్లతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన ట్రేసీ హౌవెల్‌కు క్లిపోర్డ్ అనే వ్యక్తితో 41ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన కొత్తలో ఆమె తన భర్త ఆఫీస్‌కు వెళ్లారు. మధ్యాహ్న భోజనం ఆయనతో కలిసి చేశారు. వారిద్దరూ కలిసి తింటున్న సమయంలో ఆమె భర్త ‘ప్రేమించిన వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కదూ’ అని అన్నారు. ఆఫీస్‌కు వచ్చి ప్రతిరోజు తన భర్తతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం అసాధ్యం అని ఆమెకు తెలుసు. దాన్ని సుసాధ్యం చేసేందుకు ఆమె తన బుర్రకు పదును పెట్టింది.
ఈ క్రమంలో ఆమెకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. లంచ్ బాక్స్ సిద్ధం చేసిన తర్వాత అందులోంచి కొంత తింటే.. భార్యతో కలిసి తిన్నాననే సంతృప్తిని తన భర్తకు ఇవ్వొచ్చని నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుంచి ఆమె తన ఆలోచనను అమలు చేసింది. ఆ రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన భర్త.. తన టిఫిన్ బాక్సులో కొద్ది మొత్తాన్ని ఎవరో తిన్నారని ఆమెతో చెప్పగా.. ‘ప్రేమించిన వారితో కిలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందని మీరే అన్నారు కదా.. నాతో కలిసి తిన్నాననే ఫీల్ మీకు కలగడం కోసం నేనే అందులోంచి కొంత తిన్నాను’ అని చెప్పేస్తుంది. దీంతో విషయం అతనికి అర్థమై.. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో గత 41 సంవత్సరాలుగా ఆమె.. తన భర్తకు సిద్ధం చేసిన బాక్కులోంచి కొంత తింటూనే ఉంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఫేస్‌బుక్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. అంతేకాకుండా ఆ పోస్ట్‌కు ఓ ఫొటోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Updated Date - 2020-12-12T02:51:00+05:30 IST