ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులకు ఉచిత వసతి కల్పిస్తున్న హోటల్

ABN, First Publish Date - 2020-04-06T09:18:55+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాలస్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది. అదే విధంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిది వేలు దాటింది. మొత్తంగా 16,789 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా.. అమెరికాలో లక్షలాది మంది ఆసుపత్రుల బాట పట్టడంతో వైద్యులకు క్షణం తీరిక లేకుండా పోయింది. రోజంతా ఆసుపత్రిలోనే కరోనా బాధితులతో గడపాల్సి వస్తోంది. మరోపక్క తమ వల్ల కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందేమోనని చాలా మంది వైద్యులు భయపడుతున్నారు. ఈ కారణంగా అనేక మంది ఇళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని సెంచూరిన్ అమెరికన్ డెవలప్‌మెంట్ గ్రూప్‌కు చెందిన హోటళ్లలో వైద్యులకు ఉచిత వసతిని కల్పిస్తున్నట్టు గ్రూప్ యాజమాన్యం ప్రకటించింది. టెక్సాస్‌లోని స్టాట్లర్ హోటల్‌లో ప్రస్తుతం రెండు అంతస్థులను కేవలం వైద్యుల కోసమే సిద్దం చేసినట్టు హోటల్ యజమానుల్లో ఒకరైన సీన్ టెర్రీ తెలిపారు. తన వల్ల ఇంట్లో వారికి కరోనా సోకుతుందనే కారణంతో.. ఓ నర్సు ఇంటి బాల్కనీలోనే నిద్రపోతుండటం తాను గమనించానని సీన్ టెర్రీ వివరించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య నిపుణులకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే తమ హోటల్‌లో ఉచిత వసతి కల్పిస్తున్నామన్నారు. వైద్యులకు వసతి కల్పించడం తనకు ఎంతో గర్వంగా ఉందని సీన్ టెర్రీ తెలిపారు. కాగా.. హెటల్‌లో బస చేసే వైద్యులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఉచితమని ఆయన పేర్కొన్నారు.   

Updated Date - 2020-04-06T09:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising